యాప్నగరం

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతపై కాల్పులు.. పార్లమెంట్ సమీపంలో ఘటన

ఢిల్లీలో హై సెక్యూరిటీ జోన్‌లో ఉండే పార్లమెంట్ దగ్గర కాల్పులు కలకలంరేపాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఖలీద్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. తృటిలో తప్పించుకోగలిగాడు.

Samayam Telugu 13 Aug 2018, 6:25 pm
ఢిల్లీలో హై సెక్యూరిటీ జోన్‌లో ఉండే పార్లమెంట్ దగ్గర కాల్పులు కలకలంరేపాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఖలీద్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. తృటిలో తప్పించుకోగలిగాడు. ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు.. ఆ దుండగుడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా.. గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు.
Samayam Telugu Umar


జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి చెందిన ఉమర్ ఖలీద్ సెంట్రల్ ఢిల్లీలోని ఓ క్లబ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. మిగిలిన విద్యార్థులతో కలిసి ఉమర్ ఖలీద్ క్లబ్ బయట ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్లారు. అందరూ టీ తాగుతున్న సమయంలో ఈ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి తమ వద్దకు వచ్చాడని.. తమని పక్కు తోసేస్తూ ఖలీద్‌ టార్గెట్‌గా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ తోపులాటలో ఖలీద్ కిందపడిపోవడంతో.. బుల్లెట్ల నుంచి తప్పించుకోగలిగాడన్నారు. ఘటన తర్వాత ఉమర్ ఖలీద్‌ను వెంటనే క్లబ్‌లోకి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై ఖలీద్ స్పందించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారిని అంతమొందించే కుట్ర జరుగుతోందన్నాడు. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిరిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించాడు. మరోవైపు హై సెక్యూరిటీ ఉండే పార్లమెంట్‌కు సమీపంలో ఈ కాల్పులు జరగడం కలకలంరేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ప్రశ్నించామన్నారు డీసీపీ వర్మ.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.