యాప్నగరం

కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన కాంగ్రెస్‌కు పెద్ద ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు.

TNN 29 Dec 2017, 6:58 pm
ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సహా 8 మంది ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీయే మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఫిబ్రవరిలోనే మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించబోతున్న వేళ.. ఎమ్మెల్యేల రాజీనామాలు కచ్చితంగా ముకుల్ సంగ్మా ప్రభుత్వానికి ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు.
Samayam Telugu jolt for congress 8 mlas including 5 from party quit to join bjp ally
కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు


ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడంతో అధికార కాంగ్రెస్ పార్టీ బలం 29 నుంచి 24కు చేరింది. మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత నెలలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఎన్ సయీమ్ తన పదవికి రిజైన్ చేశారు.

స్వతంత్రులు, భాగస్వాముల అండ ఉండటంతో ఇప్పటికిప్పుడు సంగ్మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు జనవరి 4న షిల్లాంగ్‌లో ర్యాలీగా వెళ్లి ఎన్‌పీపీలో చేరనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ ఆరంభంలో మేఘాలయలో బీజేపీ తరఫున మోదీ ప్రచారం ప్రారంభించారు. కాగా, ఒంటరి పోరుకే వెళ్తామని ఎన్‌పీపీ అధ్యక్షుడు కొన్రాడ్ సంగ్మా చెప్పడం గమనార్హం. మేఘాలయలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉండటంతో ఎన్‌పీపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.