యాప్నగరం

Journalist Daughter: "జైల్లో ఉన్న జర్నలిస్ట్ కుమార్తెను నేను"... తొమ్మిదేళ్ల చిన్నారి స్పీచ్ వైరల్

ఓ తొమ్మిదేళ్ల చిన్నారి (Journalist Daughter) స్పీచ్ అదరగొట్టింది. స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూల్లో అందరూ నిశ్చేష్టులయ్యే విధంగా ప్రసంగించింది. ఇప్పుడు ఆ ప్రసంగమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైల్లో ఉన్న జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కుమార్తె తను. తన తండ్రి జైల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ.. భారత దేశ పరిస్థితిపై కూడా విచారం వ్యక్తం చేసింది. పౌరుల హక్కులను హరించకూడదని అభ్యర్థించింది. తన తండ్రి జైల్లో ఉన్నాడని చెబుతూనే దేశంలో శాంతి కోసం పాటుపాడాలని సూచించింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Aug 2022, 5:01 pm

ప్రధానాంశాలు:

  • స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రసంగించిన చిన్నారి
  • అరెస్టైన సిద్ధిక్ కప్పన్ కుమార్తె మెహనాజ్ కప్పన్
  • ఉపా చట్టం కింద సిద్దిక్ కప్పన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Journalist Daughter Speech
Journalist Daughter: భారతదేశ 76వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఎందరో నాయకులు ప్రసంగించారు. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇంత చిన్న వయస్సులోనే సాధారణ పౌరుల స్వేచ్ఛను హరించరాదని ఆమె తన ప్రసంగంలో చెప్పింది. ఆ బాలిక ఎవరో కాదు.. హత్రాస్ కుట్ర కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసుపై అరెస్టైన మలయాళీ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ కుమార్తె. ఇప్పుడు ఆమె ప్రసంగమే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.
"భారత పౌరులకు లభించే ప్రాథమిక పౌర హక్కులను తిరస్కరించడంతో జైల్లో మగ్గుతున్న జర్నలిస్టు కుమార్తెను నేను" అని చిన్నారి మెహనాజ్ కప్పన్ సోమవారం పాఠశాలలో తన ప్రసంగాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు నిమిషాలు తన స్పీచ్‌లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడింది.


భారతీయుల స్వేచ్ఛను హరించకూడదని మెహనాజ్ కప్పన్ సూచించింది. ప్రతి భారతీయుడికి తమకు నచ్చని దానిని వ్యతిరేకించే హక్కు, ఎదిరించే హక్కు ఉందని తెలిపింది. అలాగే ఏం తినాలో, ఏం మతాన్ని అవలంభించాలో నిర్ణయించుకునే అధికారం అందరికి ఉందని, ఓ భారతీయురాలుగా చెబుతున్నానని తెలిపింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రమని చెప్పింది. అంతేకాదు దేశంలో అశాంతి నెలకొందని, మతం, లింగం వంటి రాజకీయాల ప్రాతిపదికన హింస సాగుతుందని చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల్లో ప్రేమ, ఐక్యతా భావాలు పెరగాలని సూచించింది. ఎంతటి ఉపద్రవాన్నైనా తుడిచిపెట్టెయాలని, భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లెందుకు కృషి చేయాలని, ఎలాంటి విభేదాలు లేని రేపటి కోసం కలలు కనాలని చెప్పింది. ఈమె స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎవరీ సిద్ధిక్ కప్పన్...?
మలయాళం న్యూస్ పోర్టల్ అజిముఖం జర్నలిస్ట్, కేరళ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (KUWJ) ఢిల్లీ యూనిట్ సెక్రటరీ సిద్ధిక్ కప్పన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఓ దళిత చిన్నారి న్యూస్‌ను కవర్ చేయడానికి వెళ్తుండగా 2020 అక్టోబర్‌లో సిద్ధిక్ కప్పన్‌ను అరెస్ట్ చేశారు. హత్రాస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో సంబంధాలు ఉన్నాయని కూడా సిద్ధిక్‌పై ఆరోపించారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన జైలుకు పంపించారు. అప్పటి నుంచి సిద్ధిక్ జైల్లోనే ఉన్నారు. ఆగస్ట్ మొదటివారంలో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అతని బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. అంతకు ముందు కప్పన్ బెయిల్ పిటిషన్‌ను మధుర కోర్టు తిరస్కరించింది.

Read Also:స్కూల్లో మత్తు పానియాలు సేవించి పార్టీ చేసుకున్న పెద్ద మనుషులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.