యాప్నగరం

సీనియర్ మహిళా జర్నలిస్టు దారుణ హత్య

ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజికవేత్త గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆమె...

TNN 5 Sep 2017, 10:15 pm
ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజికవేత్త గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం వుంటున్న గౌరి లంకేశ్ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఇరుగుపొరుగు వారు చెప్పిన కథనం ప్రకారం మంగళవారం రాత్రి 8:25 నిమిషాలకి మోటార్ బైక్‌పై గౌరీ లంకేశ్ ఇంటికొచ్చిన ముగ్గురు దుండగులు ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది.
Samayam Telugu journalist social activist gauri lankesh shot dead in bangalore
సీనియర్ మహిళా జర్నలిస్టు దారుణ హత్య


దుండగులు కాల్పులు జరిపిన సమయంలో ఆమె తన ఇంటి వద్ద గేటు వద్దే నిల్చుని వున్నారు. కాల్పుల్లో మెడ, ఛాతి భాగాల్లో బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడిన గౌరీ లంకేశ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి తుదిశ్వాస విడిచారు.

గౌరీ లంకేశ్ హత్య అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికిగురైన ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్... దుండగుల లక్ష్యం ఏంటో, ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో అంతు చిక్కడం లేదని అన్నారు. కర్ణాటకలోని మావోయిస్టు సంబంధిత వార్తలు, ఇతర సామాజిక అంశాలపై చురుకుగా పనిచేసిన పాత్రికేయురాలిగా గౌరీ లంకేశ్‌కి పేరుంది. గౌరీ లంకేశ్ హత్యను ధృవీకరించిన బెంగుళూరు సిటీ పోలీసు కమిషనర్ టి సునీల్ కమార్.. సమచారం అందుకున్న వెంటనే తాను అక్కడికే బయల్దేరినట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.