యాప్నగరం

లాలూ.. జైళ్లో మీరు పశు సంరక్షణ చూడండి: జడ్జ్!

దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు శనివారం నాడు శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

TNN 7 Jan 2018, 1:50 pm
దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు శనివారం నాడు శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దియోగఢ్ ఖజానా నుంచి అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో సహా బయటపడటంతో ఆయనకు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. లాలూకు శిక్ష ఖరారు చేసే సమయంలో న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాణా కేసులో లాలూతోపాటు మొత్తం 16 మంది దోషులు ఓపెన్ జైళ్లో ఉండి, పశువుల సంరక్షణ చూడాలని ఆదేశించారు. ఎందుకంటే దోషులకు ఇదే సరైన శిక్ష... పశు దాణా, పశువుల పెంపకం, వాటి ఔషధాల గురించి వారికి మంచి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. తను ఆరు మాసాల శిక్షను తగ్గించాలన్న ఈ కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తి విన్నపాన్ని కోర్టు మన్నించి బెయిల్ మంజూరు చేసింది.
Samayam Telugu judge asks lalu to stay in open jail rear cattle
లాలూ.. జైళ్లో మీరు పశు సంరక్షణ చూడండి: జడ్జ్!


దీంతో లాలూకు జైలులో అధికారులు పని అప్పగించారు. బిర్సా ముండా జైలులో తొటమాలిగా పనిచేసే అవకాశాన్ని కల్పించి, రోజుకు రూ. 93 దినసరి కూలీ ఇవ్వనున్నారు. మరోవైపు జైళ్లో ఉన్న లాలూ పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదలైంది. దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తాను పోరాడతానని, తనను దోషిగా తేల్చి, జైలుకు పరిమితం చేయాలని చూసినా ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని లాలూ స్పష్టం చేశారు. పనిలో పనిగా బీజేపీపై కూడా లాలూ విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపించారు. తమ మాట వినకుంటే ఎవరినైనా వేధించడం బీజేపీ నైజమని నిప్పులు చెరిగారు.

లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995- 97 కాలంలో రూ.900 కోట్లు మేర పశుదాణా కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.