యాప్నగరం

కేవలం 21 రోజుల్లో 50 లక్షల మందికి వ్యాక్సిన్.. భారత్ నయా రికార్డు

India Coronavirus Vaccination Drive: భారత్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కేవలం 21 రోజుల్లోనే 50 లక్షలకు పైగా మందికి టీకా అందజేసింది.

Samayam Telugu 6 Feb 2021, 12:15 am
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో వడివడిగా సాగుతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 5) నాటికి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 52,90,474 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం 21 రోజుల్లోనే 50 లక్షల మార్క్‌ను అందుకున్నట్లు వివరించింది. దీంతో భారత్ మరో ఘనత సాధించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Corona vaccine


50 లక్షల మందికి వ్యాక్సిన్‌ను వేయడానికి అమెరికాలో 24 రోజులు, యూకేలో 43 రోజులు, ఇజ్రాయెల్‌లో 45 రోజుల సమయం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని తెలిపారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.