యాప్నగరం

సీఎం కావాలని ఉందన్న స్టార్‌హీరో!

తన గురి ముఖ్యమంత్రి పీఠం మీదే అని ప్రకటించేశాడు తమిళ స్టార్ హీరో

TNN 22 Sep 2017, 7:58 am
తన గురి ముఖ్యమంత్రి పీఠం మీదే అని ప్రకటించేశాడు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఉందని కమల్ స్పష్టం చేశాడు. తద్వారా తను రాజకీయాల్లోకి వస్తున్నది అధికారాన్ని సాధించుకునేందుకే అని ఈ హీరో స్పష్టతను ఇచ్చాడు. చాలా మంది దక్షిణాది హీరోలు ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకునే రాజకీయాల్లోకి వచ్చారు. సొంత పార్టీలు పెట్టారు. వారిలో కొందరి కలలు నెరవేరాయి. కొందరి కలలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కూడా ముఖ్యమంత్రి పదవే లక్ష్యం అని ప్రకటించడం గమనార్హం.
Samayam Telugu kamal ready to serve t n as chief minister
సీఎం కావాలని ఉందన్న స్టార్‌హీరో!


తను రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని ఇది వరకూ కమల్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ హీరో వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై వెళ్లి కమల్ తో సమావేశం అయ్యాడు. వీళ్లిద్దరూ చాలా సేపే చర్చింకున్నారు. అయితే.. కమల్ ఆప్ లోకి చేరబోతున్నట్టు ఏమీ ప్రకటించలేదు. తను సొంత పార్టీ పెడతాను అని కమల్ ఇది వరకే ప్రకటించాడు. అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అనంతరం కూడా కమల్ అదే మాటే చెప్పారు.

తను సొంత పార్టీ పెడతాను అని, ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని తెలిపాడు. అవినీతిపై పోరాటమే తమ అజెండా అని ఈ హీరో వ్యాఖ్యానించాడు. తన సహచరుడు రజనీకాంత్ తో సత్సంబంధాలే ఉన్నాయని, రజనీ రాజకీయాల్లోకి వస్తే.. అతడి లక్ష్యం కూడా అవినీతి రహిత సమాజమే అని కమల్ అన్నాడు. తను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోనని.. సొంతంగానే పోటీ చేస్తానని కమల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.