యాప్నగరం

తిరుమల శ్రీవారిపై నోరుజారిన కనిమొళి

తిరుమల శ్రీవారిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుచ్చిలో జరిగిన ‘నాస్తిక సమాజం

TNN 11 Jan 2018, 9:47 am
తిరుమల శ్రీవారిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుచ్చిలో జరిగిన ‘నాస్తిక సమాజం మహానాడు’లో ఎంపీ మాట్లాడుతూ మనుషుల్ని మతాలే వేర్వేరుగా విడగొడుతున్నాయని.. యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే దీనికి నిదర్శనమన్నారు. తిరుమల వెంకటేశ్వరుడికి శక్తులుంటే ఆయన హుండీలను కాపాడేందుకు భద్రతా సిబ్బంది ఎందుకు..? అంటూ ప్రశ్నించారు.
Samayam Telugu kanimozhis strong but logical satires on lord balaji
తిరుమల శ్రీవారిపై నోరుజారిన కనిమొళి


‘తిరుమల వెంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు. పేదవారు శ్రీవారిని దర్శించుకోవాలంటే సుదీర్ఘంగా క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దేవుడికి శక్తులుంటే.. అక్కడ భక్తులు కానుకలు వేసే హుండీలకి భద్రతా సిబ్బంది కాపలా ఎందుకు..? ఆయనకి భద్రత ఎందుకు..?. మహిళల్ని బానిసలుగా మార్చేలా మతాలే ఉసిగొల్పుతున్నాయి. చరిత్ర చూస్తే.. యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే ఎక్కువ. ఈ ఘర్షణలను నిర్మూలించాలంటే మానవతావాదాన్ని, నాస్తికవాదాన్ని వ్యాపింపజేయాలని’ అని కనిమొళి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపీ మాటలు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని హిందూమక్కల్ కట్చి మండిపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.