యాప్నగరం

భార్య నాలుక కోసిన భర్త.. కట్నం కోసం దుర్మార్గం

కట్నం కోసం దారుణానికి ఒడిగట్టిన భర్త.. భార్య నాలు కోసి.. ఇంట్లోనే నిర్బంధం.. 15 రోజులు నరకం అనుభవించిన బాధితురాలు.

Samayam Telugu 20 Nov 2018, 1:49 pm
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుక కోసేశాడో భర్త. ఈ ఘోరం బయటపడకుండా.. ఇంట్లోనే బంధించి 15 రోజులుగా దారుణంగా హింసించాడు. చిత్ర హింసలు పెడుతూ.. నరకం చూపించాడు. విషయం ఆ నోటా.. ఈ నోటా చేరి.. చివరికి తండ్రికి విషయం తెలియడంతో ఆమెను భర్త చెర నుంచి విడిపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu up.


కాన్పూర్ జిల్లాలోని బర్రా ప్రాంతానికి చెందిన ఆకాష్‌ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. కట్నం తేవాలంటూ రోజూ భార్యను టార్చర్ పెడుతున్నాడు. భర్త చిత్రహింసలు పెడుతున్నా.. భరిస్తూ ఆమె అత్తింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలో నవంబర్ 6న ఆకాష్ భార్యతో గొడవకు దిగాడు.. కట్నం తీసుకోస్తావా లేదా అంటూ మరోసారి విరుచుకుపడ్డాడు. ఆమెపై పైశాచికంగా దాడి చేశాడు. తర్వాత కోపంతో ఊగిపోతూ.. కత్తితో భార్య నాలుక కోశాడు.

పాపం భర్త నాలుక కోయడంతో.. ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. అయినా భర్త వదల్లేదు.. ఆమెను ఓ గదిలో నిర్బంధించి.. రోజూ హింసిస్తూనే ఉన్నాడు. ఈ గొడవ గురించి బాధితురాలి తండ్రికి తెలియడంతో.. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లాడు. నిర్బంధంలో ఉన్న కూతుర్ని విడిపించాడు. వెంటనే వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె కాస్త కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.