యాప్నగరం

మీడియాతో మాట్లాడుతుండగానే పడిపోయిన..

ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్ర స్పృహ తప్పిపడిపోయారు. ఆదివారం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Samayam Telugu 14 May 2017, 12:00 pm
ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్ర స్పృహ తప్పిపడిపోయారు. ఆదివారం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎంపై అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ,డొల్ల కంపెనీలతో పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
Samayam Telugu kapil mishra fainted at press meet after taking on kejriwal
మీడియాతో మాట్లాడుతుండగానే పడిపోయిన..


హవాల, మార్గంలో, మాఫియా నేతల నుంచి కూడా ఆప్ కు భారీగా నిధులు వచ్చినట్లు కపిల్ విమర్శించారు. ఆప్ నేతలు, కేజ్రీవాల్ లకు వివిధ మార్గాల్లో అందిన చందాలకు సంబంధించి కపిల్ ఆధారాలు చూపించారు. మీడియాకు పీపీటీ ద్వారా డాక్యుమెంట్లు ప్రదర్శించారు.

అనంతరం మీడియా మాట్లాడుతుండగా స్పృహ తప్పి పడిపోయారు. ఆయన కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కపిల్ మూడు రోజులు ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు.

కపిల్ మిశ్ర రేపటి కల్లా కోలుకోకపోతే తాను కేజ్రీవాల్ పై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ఆయన భార్య మీడియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.