యాప్నగరం

సీఎంకు సస్పెండైన నేత తల్లి ఘాటు లేఖ

ఆప్ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్ర తల్లి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు.

TNN 12 May 2017, 1:33 pm
ఆప్ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్ర తల్లి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు. తన తనయుడు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Samayam Telugu kapil mishras mother takes on arvind kejriwal in a letter
సీఎంకు సస్పెండైన నేత తల్లి ఘాటు లేఖ


గురువారం కపిల్ మిశ్ర దీక్షా శిబిరాన్ని ఆయన తల్లి అన్నపూర్ణ మిశ్ర సందర్శించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు. ఆమె కేజ్రీవాల్ కు బహిరంగ లేఖ రాశారు.

‘కేజ్రీవాల్.. ఎన్ని అబద్ధాలు..ఇంకెన్ని అబద్దాలు?’ అంటూ ప్రశ్నించారు.

‘నా కొడుకు అడుగుతున్న ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు లేవు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు’ అని ఆమె విమర్శించారు.
ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కూడా ఆప్ దగ్గర నిధులు లేవని చెబుతున్న నేతలకు విదేశాల పర్యటనకు డబ్బులు ఎలా వచ్చాయని కపిల్ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్ తో తన కొడుకు కలిసి పనిచేశాడని, కపిల్ ఎవరికీ ఏజెంట్ కాదని, నిజానికి మాత్రమే ఏజెంట్ అని స్పష్టం చేసిన అన్నపూర్ణ..కపిల్ మూడురోజులుగా అన్నపానియాలు మానేశాడని ఆవేదన చెందారు.

కేజ్రీవాల్ ని మూర్ఖుడిగా ఆమె మండిపడ్డారు.

माँ का पत्र @ArvindKejriwal के लिए pic.twitter.com/NFcJEevNXG— Kapil Mishra (@KapilMishraAAP) May 12, 2017
2007లో ఓ సమావేశంలో తనను కేజ్రీవాల్ కలిసి ‘స్వరాజ్’ఉద్యమం గురించి మాట్లాడిన సంగతి గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.

‘ఈ అబద్ధాలు నిన్ను ముందుకు తీసుకెళ్లలేవు. దేవుడికి భయపడాల్సిందేనని’ ఆమె ఘాటుగా లేఖలో పేర్కొన్నారు.

కేజ్రీవాల్ సహచర మంత్రి దగ్గర రూ.50కోట్లు లంచం తీసుకున్నారని కపిల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.