యాప్నగరం

మంచు దుప్పటిలో కశ్మీర్!

జమ్మూ కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 52 గంటలుగా కశ్మీర్ వాలీని హిమపాతం ముంచెత్తుతోంది.

TNN 27 Jan 2017, 11:45 am
జమ్మూ కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన 52 గంటలుగా కశ్మీర్ వాలీని హిమపాతం ముంచెత్తుతోంది. రికార్డు స్థాయిలో మంచు కురుస్తుండటంతో సైనికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్గిల్, గురేజ్, బందిపొర ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురుస్తోంది. ఇళ్లు, రోడ్లపై మంచు పేరుకుపోవడంతో గడ్డపారలతో ప్రజలు మంచును తొలగిస్తున్నారు.
Samayam Telugu kargil experiencing continuous heavy snow fall from last 52 hours
మంచు దుప్పటిలో కశ్మీర్!


ప్రస్తుతం కార్గిల్ ప్రాంతాన్ని చూస్తే ఫారన్ అనుభూతి కలుగుతోంది. మంచు దుప్పటిలో ఉన్న ప్రాంతం మనం చూడటానికి అద్భుతంగా ఉన్నా అక్కడి ప్రజలకు మాత్రం నరకంగా మారింది. కొన్ని చోట్ల మంచు గడ్డలుగా పేరుకుపోతోంది. మరికొన్ని చోట్ల మంచు చరియలు విరిగి జనావాసాలపై పడుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో హిమపాతం వల్ల కశ్మీర్‌లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది సైనికులు కాగా నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. హిమపాతం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరించారు. అలాగే సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికులకు సైతం మంచు చరియల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆర్మీ సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.