యాప్నగరం

రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ

రూ.50వేలలోపు అప్పు తీసుకున్న రైతులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తీపి కబురు ప్రకటించింది.

Samayam Telugu 21 Jun 2017, 3:43 pm
రూ.50వేలలోపు అప్పు తీసుకున్న రైతులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తీపి కబురు ప్రకటించింది. రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ యేడాది జూన్ 20 (మంగళవారం) దాకా రుణాలు పొందినవారు ఈ రుణమాఫీ లబ్దిపొందనున్నట్లు ఆయన బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. రైతు రుణమాఫీతో ప్రభుత్వంపై రూ.8,165 కోట్లు ఆర్థికభారం పడనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల పాక్షిక రుణమాఫీ ప్రకటించిన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగోది. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ లు కూడా పాక్షికంగా రైతుల రుణాలు మాఫీ చేశాయి.
Samayam Telugu karnataka announces farm loan waiver up to rs 50000
రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ


కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణమాఫీతో 22 లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారు. గత మూడేళ్లుగా తీవ్రకరువు ఎదుర్కొన్న ఈ రాష్ట్రంలో... చిన్న,సన్నకారు రైతులు రుణాలు చెల్లించలేకపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.