యాప్నగరం

కర్ణాటక ఉప-ఎన్నికలు: ఆధిక్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి

కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Samayam Telugu 6 Nov 2018, 10:04 am
కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీకి కంచుకోటలా భావించే బళ్లారిలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 39 వేల పైచిలుక ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాండ్య పార్లమెంటు స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఎల్‌ఆర్ శివరామ గౌడ సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సిద్ధరామయ్యపై దాదాపు లక్షా 20 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శివమొగ్గలో ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక శాసనసభ స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగుతోంది. రామనగర్‌లో జేడీఎస్ అభ్యర్థి, సీఎం సతీమణి అనితా 50 వేలు ఓట్ల ఆధిక్యంలో ఉండగా, జమఖండిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ఎస్ న్యామగౌడ 30 వేలు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాండ్య లోక్‌సభ స్థానంలో నోటాకు ఇప్పటి వరకు 226 ఓట్లు వచ్చాయి.
Samayam Telugu congress


మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాలతోపాటు రామనగర, జమాఖండి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటింగ్ కోసం 6,450 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా జమఖండిలో 77.17 శాతం, రామనగరలో 71.18 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇక బళ్ళారి , శివమొగ్గ, మాండ్యలలో వరుగా 65.85, 61.05, 53.93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జెడీఎస్‌ కూటమి అభ్యర్ధులు బరిలో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.