యాప్నగరం

కొలువుదీరిన బొమ్మై కేబినెట్.. యడ్డీ కుమారుడికి ఝలక్

కర్ణాటక కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు

Samayam Telugu 4 Aug 2021, 8:38 pm
కర్ణాటకలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్‌లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించినప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉంటారని భావించినప్పటికీ ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం గమనార్హం.
Samayam Telugu Image


2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో బీసీ పటేల్‌, బీఏ బసవరాజు, డాక్టర్‌ కె.సుధాకర్‌, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారయణ గౌడ, గోవింద్‌ కరజోల్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్‌ కత్తి, ఎస్‌. అంగర, జేసీ మధుస్వామి, మురేగేశ్‌ నిరానీ, శివరామ హెబ్బార్‌, సీఎస్‌ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్‌, ఆనంద్‌ సింగ్‌, ఎస్‌టీ సోమేశేఖర్‌, బీసీ నగేష్‌, వి.సునీల్‌ కుమార్‌, హాలప్ప ఆచార్‌, శంకర్‌ పాటిల్‌ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు.

కొత్త కేబినెట్లో అన్ని సామాజిక వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. బొమ్మై కేబినెట్‌లో 8 మంది లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. కొత్త మంత్రులకు మరో రెండ్రోజుల్లో శాఖలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.