యాప్నగరం

ప్రెస్‌మీట్‌లోనే కునుకు తీసిన సీఎం!

స్లీపింగ్ డిజార్డర్ రుగ్మత ఎదుర్కొంటున్న ఈ సీఎం.. నిద్రావస్థను అధిగమించడానికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు..

TNN 26 May 2017, 3:58 pm
ఆ సీఎం నిద్రను అస్సలు ఆపుకోలేరు. గతంలో పబ్లిక్ మీటింగుల్లో, ముఖ్యమైన సమావేశాల్లో కునుకు తీస్తూ అనేక సార్లు పత్రికలవాళ్లకు దొరికిపోయారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎంత గందరగోళం మధ్యైనా హాయిగా నిద్రపోయే రికార్డు ఉంది ఆయనగారికి. తాజాగా ఆయన ఏకంగా పత్రికా సమావేశంలో కునుకు తీస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు.​ స్లీపింగ్ సీఎంగా పేరు పొందిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో కునుకు తీస్తూ కెమెరాల‌కు చిక్కారు.
Samayam Telugu karnataka cm siddaramaiah sleeps again at press conference
ప్రెస్‌మీట్‌లోనే కునుకు తీసిన సీఎం!


కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లోనే ఆయ‌న ఇలా నిద్ర‌పోవ‌డం దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు కారణమైంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇంచార్జ్ అయిన వేణుగోపాల్ మాట్లాడుతుండ‌గానే.. ఆయ‌న ఏమీ ప‌ట్ట‌న‌ట్లు నిద్ర‌లోకి జారుకోవడం గమనార్హం. ప్రెస్‌మీట్లో కునుకు తీస్తూ దొరికిపోవడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో ఇలాగే ఆయన పత్రికా సమావేశంలో గురక పెట్టి నిద్రిస్తుండటం.. దాన్ని గమనించిన ఓ మహిళా నేత ఆయణ్ని తడుతూ లేపడానికి ప్రయత్నించడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొట్టింది.
Karnataka CM Siddaramaiah appears to have dozed off during Congress press conference in Bengaluru pic.twitter.com/tgKTgdNrt9 — ANI (@ANI_news) May 26, 2017
స్లీపింగ్ డిజార్డర్ రుగ్మత ఎదుర్కొంటున్న ఈ సీఎం.. నిద్రావస్థను అధిగమించడానికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఓ యోగా గురువు సూచన మేరకు నిద్రా తిప్పల నుంచి బయట పడటానికి ఇటీవలే ఆయన ఆసనాలు కూడా మొదలెట్టారట. కానీ, ఇవేవీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.