యాప్నగరం

కర్ణాటక: గాలి జనార్థన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల తంతు ముగియడంతో... పార్టీలన్నీ జనాల్లోకి వెళుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఓ అనూహ్యం పరిణామం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Samayam Telugu 25 Apr 2018, 9:52 pm
కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల తంతు ముగియడంతో... పార్టీలన్నీ జనాల్లోకి వెళుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఓ అనూహ్యం పరిణామం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ ప్రచారంలో మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్‌రెడ్డి ప్రత్యక్షం కావడం హాట్‌టాపిక్ అయ్యిందట. తన మిత్రుడు, మొలకల్‌మూరు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు తరపున ప్రచారం చేశారట. చిత్రదుర్గలో నిర్వహించిన రోడ్‌ షోలో కూడా ఆయన పాల్గొన్నారట. అంతేకాదు బీజేపీ కోసం పనిచేస్తున్నానని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తమ సోదరులకు బీజేపీ తల్లిలాంటిదని... గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి అన్నారట.
Samayam Telugu Gali Janardhan Reddy


బళ్లారిలో జనార్థన్ రెడ్డిపై ఆంక్షలు ఉండటంతో ఆయన... జిల్లా బయట ఉన్న మొలకల్‌మూరులో ప్రచారం చేశారని తెలుస్తోంది. గాలి బీజేపీలో లేరని అమిత్ షా ఇటీవలే అన్నారట... కాని ఆయన మాత్రం ఇలా ప్రచారంలో పాల్గొనడం కర్ణాటకలో హాట్‌టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.