యాప్నగరం

ఓటరు కార్డుల కేసులో 14 మందిపై ఎఫ్‌ఐఆర్‌!

కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గంలో వేలాది ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి 14 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎమ్మేల్యే ఎన్ మునిరత్నపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

TNN 11 May 2018, 4:31 pm
కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గంలో వేలాది ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి 14 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎమ్మేల్యే ఎన్ మునిరత్నపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం దారుణమని, తనను వేధించడానికి, అవమానపర్చాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలో ఓటు వేయడానికి సుమారు 40 వేల కరపత్రాలను పంచానని, కావాలంటే ప్రతి ఇంటిని పరిశీలించవచ్చునని తెలిపారు. అక్కడ ఫ్లాట్‌లో దొరికిన కరపత్రం ఆధారంగానే తనను 14వ నిందితునిగా చేర్చారని పేర్కొన్నారు.
Samayam Telugu voter ids


ఈ విషయంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఈ ఐడీ కార్డులు ఉన్న ఫ్లాట్ యజమానురాలు మంజుల నంజుమారి బీజేపీ తరపున కార్పొరేటర్‌గా గెలిచారని, ఆమె కుమారుడు శ్రీధర్ కూడా బీజేపీ కార్యకర్తేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే అపార్ట్‌మెంట్‌ యజమానురాలు మంజుల నంజుమూరితోపాటు మరో 12 మందిపై కేసులు నమోదు కాగా, ఇంతవరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

గత మంగళవారం (మే 8) బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌ నియోజకవర్గంలో ఉన్న జలహల్లిలోని ఒక అపార్టుమెంట్‌లో ఎన్నికల కమిషన్‌ అధికారులు జరిపిన సోదాల్లో దాదాపు 9,756 ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులు బయటపడ్డాయి. వీటితోపాటు మరో లక్ష నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను సైతం గుర్తించారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ ప్రింటర్‌‌ను కూడా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.