యాప్నగరం

కంబళ క్రీడపై తీర్పు రెండు వారాల వాయిదా

కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళపై ఆ రాష్ట్ర హైకోర్టు రెండువారాలపాటు వాయిదా వేసింది. జల్లికట్టు

Samayam Telugu 30 Jan 2017, 2:42 pm
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళపై ఆ రాష్ట్ర హైకోర్టు రెండువారాలపాటు వాయిదా వేసింది. జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే కంబళపై స్పందించాలని నిర్ణయించినట్లు కర్ణాటక హై కోర్టు స్పష్టం చేసింది.
Samayam Telugu karnataka hc adjourns kambala issue by two weeks
కంబళ క్రీడపై తీర్పు రెండు వారాల వాయిదా


నీళ్లబురదతో దున్నపోతుల జోడును ఓ పొడవాటి చెక్కలకు కట్టేసి పరుగెత్తించే ఆట ఈ కంబళ క్రీడ. తమిళనాడులో ఎద్దులతో ఆడితే కర్ణాటకలో దున్నపోతులతో ఆడతారు. కర్ణాటకలో 8వందల సంవత్సరాలుగా కంబళ క్రీడ సంప్రదాయ బద్ధంగా కొనసాగుతోంది. అయితే 2014లో జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేదం విధించడంతో...కర్ణాటకలో కూడా కంబళపై నిషేదం అమలవుతోంది.

తమిళనాడులో జల్లికట్టు క్రీడ కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ఆమోదించిన నేపథ్యంతో..తమ రాష్ట్రంలోనూ కంబళ నిర్వహణకోసం ప్రత్యేక చట్టం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించారు.

దీనికితోడు కంబళ క్రీడపై నిషేదం ఉన్నప్పటికీ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రైతులు సంప్రదాయ క్రీడను కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా కంబళపై నిషేదం ఎత్తివేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కంబళ పోరాట సమితి నేతలు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.