యాప్నగరం

cobra: పాముతో ఓవర్ యాక్షన్... దాని రియాక్షన్‌కి ఆస్పత్రి బెడ్‌ ఎక్కాడు

కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ తాచుపాము (cobra)జనాలు ఉండే ఆవాసంలో వచ్చింది. దానిని చూసిన స్థానికులు బెదిరిపోయారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దానిని పట్టుకున్నాడు. అలా పట్టుకున్న దానిని వెంటనే పొదల్లోకి వదిలేయకుండా.. దాని తలపై ముద్దుకోబోయాడు. ఆ ఓవర్ యాక్షన్‌కు పాము బెదిరిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి అతని పెదవులపై కాటు వేసింది. దెబ్బతో ఆ పామును వదిలేశాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ప్రాణాలకు ఎటువంటి హాని లేదని సమాచారం.

Authored byAndaluri Veni | Samayam Telugu 1 Oct 2022, 8:41 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో పాముకాటుకు గురైన వ్యక్తి
  • పాము తలపై ముద్దు పెట్టబోయిన వ్యక్తి
  • పెదవులపై కాటువేసిన తాచుపాము

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Man tries to kiss snake
cobra: కొన్ని చేసేటప్పుడు.. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ముఖ్యంగా జంతువులతో ఏదన్న చేసినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే.. ప్రాణాల మీదకు వస్తుంది. కర్ణాటకలో సేమ్ ఇదే జరిగింది. దాంతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. శివమొగ్గకు చెందిన ఒక వ్యక్తి పాముతో ఆటలాడాడు.. దాంతో అది చుక్కలు చూపించింది.
శివమొగ్గలోని ఓ ప్రాంతంలో ఇళ్ల మధ్యలోకి ఓ తాచుపాము వచ్చింది. దాంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే దానిని ఓ వ్యక్తి పట్టుకున్నాడు. దానిని ఏ పొదల్లోకో వదిలేయకుండా సినిమాల్లో హీరో స్టైల్లో పాము తలపై ముద్దుపెట్టుకోబోయాడు. అది కాస్తా బెదిరిపోయి.. టక్కున వెనక్కి తిరిగి అతని మూతిపై కాటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఆ వ్యక్తి పాము పడగపై వెనుక నుంచి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించగా.. వెంటనే వెనక్కు తిరిగిన పాము అతని పెదాలపై కాటేసింది. దెబ్బతో ఆ వ్యక్తి బెదిరిపోయి.. పామును వదిలేశాడు.


అయితే పాము కాటు వేసిన వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదని తెలుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నాడా..? లేదా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే.. అతను చేసిన పనిపై సెటైర్లు పేల్చారు. ఆ పాము కూడా అతనికి ముద్దు పెట్టిందని, సారీ.. ఆ పాముకు ఆల్‌రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని సెటైరికల్‌గా కామెంట్లు పెట్టారు. పాముతో పరాచకాలిడితే ఇలానే ఉంటుందని కొందరు హితవు పలుకుతున్నారు. కాగా గతంలో కూాడా పాములు పట్టడంలో ని నిష్ణాతులైన వ్యక్తులే పాము కాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. కొందరి ప్రాణాలు కూడా కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.