యాప్నగరం

కర్నాటకలో అడుగంటిన జలాశయాలు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదేనని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరి నదీ జలాల పంపిణీ వ్యవహారం చూస్తే అనుకోవాల్సిందే.

TNN 27 Sep 2016, 8:02 pm
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదేనని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరి నదీ జలాల పంపిణీ వ్యవహారం చూస్తే అనుకోవాల్సిందే. దిగువన తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని ఒకవైపు సుప్రీం ఆదేశాలు... వాటిని పాటించకపోతే కోర్టు ధిక్కారమనే ఆరోపణలను కర్నాటక ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. పోనీ, సుప్రీం తీర్పు మేరకు నీరు విడుదల చేస్తే.. సొంత గడ్డపై సాగు నీరు కాదు కదా, తాగు నీటికి అలో లక్ష్మణా అంటూ గొంతులెండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. హేమావతి డ్యామ్ లోని నీటి నిల్వలు నిండుకున్నాయి. సాగునీటికి ఈ ప్రాజెక్టులో నీరు ఏమాత్రం అందుబాటులో లేదు. తాగునీటికి కూడా చూసి చూసి వాడుకోవాల్సిన పరిమాణంలో మాత్రమే నీరుంది. హసన్, చన్నరాయపట్న, కె.ఆర్.పేటే, హోలేనర్సీపుర తదితర ప్రాంతాలు ఈ డ్యామ్ పై ఆధారపడి ఉన్నాయి. రానున్న ఎనిమిది నెలల పాటు ఈ డ్యాములోని నీటినే తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాల్సి ఉందని డ్యామ్ యంత్రాంగం చెప్పింది. సుప్రీం తీర్పునకు తలొగ్గి రాష్ట్ర ప్రజల గొంతు ఎండేలా చేయడం తనకిష్టం లేదని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును అమలుచేయకపోతే అది పెద్ద రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని న్యాయనిపుణులు చెపుతున్నారు.
Samayam Telugu karnataka reservoirs run dry crops worth crores left to wither
కర్నాటకలో అడుగంటిన జలాశయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.