యాప్నగరం

కరుణానిధి మృతితో చెన్నైలో హై అలర్ట్

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కావేరి ఆస్పత్రితో పాటూ డీఎంకే ఆఫీస్, కరుణానిధి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Samayam Telugu 7 Aug 2018, 9:13 pm
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కావేరి ఆస్పత్రితో పాటూ డీఎంకే ఆఫీస్, కరుణానిధి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులు హాజరుకావాలని ఆదేశించడంతో.. బలగాలన్నీ చెన్నైకు చేరుకున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా మద్యం షాపుల్ని కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సినిమా థియేటర్లకు కూడా బంద్ ప్రకటించారు. అలాగే తమిళనాడుకు వెళ్లాల్సిన బస్సు సర్వీసుల్ని కూడా నిలిపివేశారు.
Samayam Telugu Chennai


రాష్ట్ర డీజీపీ భద్రతను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే బుధ, గురువారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. కరుణ ఇకలేరని తెలియగానే కావేరీ ఆస్పత్రి దగ్గరకు అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివస్తుండంతో.. అక్కడ కూడా అదనపు బలగాలను మోహరించారు.అభిమానుల రాకతో కావేరీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ఎస్పీలను కూడా చెన్నైకు పిలిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.