యాప్నగరం

అమ్మ విన్నపంతో ఉగ్రవాదాన్ని వదిలేశాడు!

ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైన ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే హింసను విడనాడి తిరిగి వచ్చేయాలని అమ్మ కోరికను మన్నించాడు.

TNN 2 Mar 2018, 3:13 pm
ఉగ్రవాదంలో చేరిన ఓ యువకుడు తల్లి విఙ్ఞ‌ప్తితో తిరిగి వచ్చిన ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది. అమ్మ విన్నపానికి మరో యువకుడు లోయలో హింసను త్వజించి కుటుంబంలో చేరాడని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తెలిపారు. అతడు కుటుంబంతో మళ్లీ కలవడం చాలా సంతోషమని వేద్ ట్వీట్ చేశారు. అయితే ఆ యువకుడి వయసు మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాదుల్లో చేరిన నలుగురు కశ్మీర్ యువకులు 2017లో తిరిగి జనజీవన స్రవంతిలో చేరారు. దీనిపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ శాసనసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తప్పుదోవ పట్టించి ఉగ్రవాదంలో చేరిన యువకుల్లో నలుగురు తిరిగి తమ కుటుంబాలతో కలిసినట్టు బీజేపీ ఎంఎల్సీ విక్రమ్ రాంధ్వా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.
Samayam Telugu kashmir militant returns home after mothers appeal
అమ్మ విన్నపంతో ఉగ్రవాదాన్ని వదిలేశాడు!


ఉగ్రవాదంలో చేరిన యువకులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవడానికి వారి కుటుంబాలకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ముఫ్తీ పేర్కొన్నారు. యువతలో వేర్పాటువాద, తీవ్రవాద భావజాలాన్ని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలియజేశారు. ఇందుకోసం క్రికెట్ టోర్నమెంటులు, పోలీస్ స్టేషన్ స్థాయిలో ఐటీ, ఇండోర్ గేమ్స్ గురించి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. యువతను తప్పుదోవ పట్టించడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని జమ్మూ కశ్మీర్ సీఎం ప్రకటించారు.

Another young boy responding to the appeals of crying mother returned to the fold of family leaving path of violence in the valley. I wish the family happy re- union. — Shesh Paul Vaid (@spvaid) March 2, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.