యాప్నగరం

బీబీసీ వాళ్లని ఆ దరిదాపుల్లోకి రానివ్వకండి

అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బీబీసీ పై భారత్ తో నిషేధం పడింది.

TNN 28 Feb 2017, 11:35 am
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బీబీసీ పై భారత్ తో నిషేధం పడింది. ఆ సంస్థ తరుపున చేసిన ఓ డాక్యుమెంటరీ వివాదాస్పదం అవ్వడంతో... దేశంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఆ ఛానెల్ వాళ్లని రానివ్వద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుపై బీబీసీ ఛానెల్ తరుపున దక్షిణాసియా ప్రతినిధి జస్టిన్ రౌలత్ ‘ వన్ వరల్డ్: కిల్లింగ్ ఫర్ కన్ సర్వేషన్’ పేరుతో డాక్యుమెంటరీ తీశారు. అందులో చాలా దారుణంగా కొన్ని విషయాలు చెప్పారు. ఖడ్గమృగాలకు కనీస రక్షణ లేదని, అవి మరణిస్తున్నాయని... అలాగే కజిరంగలోని ఫారెస్ట్ గార్డులకు తుపాకులు ఇచ్చి... రైనోలకు ఆపద అనుకుంటే ఎవరినైనా కాల్చే చంపే హక్కు ఇచ్చారని చెప్పారు. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu kaziranga report gets bbc banned from tiger reserves for 5 years
బీబీసీ వాళ్లని ఆ దరిదాపుల్లోకి రానివ్వకండి


ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేసే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలని బీబీసీ ఆ పనిచేయలేదని ఆరోపించింది. అన్ని రిజర్వ్ ఫారెస్టులకు, వన్య మృగాల పార్కులను నియంత్రించే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అధారిటీ (ఎన్టీసీఎ) ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. బీబీసీ ఛానెల్ పైనా, ఆ డాక్యుమెంటరీ తీసిన జస్టిన్ రౌలత్ పై అయిదేళ్ల పాటూ నిషేధం విధించింది. దేశంలో ఉన్న వన్యమృగాల పార్కులు, టైగర్ రిజర్వ్ ఫారెస్టులు, జూల దగ్గరికి బీబీసీ వాళ్లని రానివ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.