యాప్నగరం

రామ్ కిషన్ కుటుంబానికి కోటి పరిహారం

రామ్ కిషన్ గ్రేవాల్... ఈ పేరు అతను బతికున్నప్పుడు ప్రపంచానికి తెలియదు.

TNN 3 Nov 2016, 4:33 pm
రామ్ కిషన్ గ్రేవాల్... ఈ పేరు అతను బతికున్నప్పుడు ప్రపంచానికి తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక రాజకీయ నాయకులు అతడిని సెలెబ్రిటీని చేశారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ పథకం అమల్లో జాప్యం జరగడంతో మనస్తాపం చెందిన రామ్ కిషన్ (70) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.కోటి పరిహారాన్ని తాజాగా ప్రకటించారు. అలాగే అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. రామ్ కిషన్ హర్యానాకు చెందిన మాజీ సైనికుడు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.10లక్షలను పరిహారంగా ప్రకటించింది.
Samayam Telugu kejriwal announces one crore exgratia for ram kishans family
రామ్ కిషన్ కుటుంబానికి కోటి పరిహారం


బుధవారం రామ్ కిషన్ మృతదేహాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీసీఎం మనీష్ సిసోడియా, మరికొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీని పోలీసులు రెండుసార్లు అరెస్టు చేసి విడుదల చేశారు.

రామ్ కిషన్ అంత్యక్రియలు గురువారం హర్యానాలోని అతని స్వగ్రామంలో జరిగాయి. దీనికి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ హాజరయ్యారు. కుటుంబానికి కోటి పరిహారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.