యాప్నగరం

శిశు మరణాల రేటులో అమెరికాతో సమానంగా కేరళ!

కేరళలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 వెల్లడించింది. ఈ సంఖ్య అమెరికా సగటుకు సమానమని తెలిపింది.

TNN 3 Mar 2017, 3:08 am
కేరళలో శిశువుల మరణాల రేటు ప్రతి 1000 మందికి ఆరుగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 వెల్లడించింది. ఇది అమెరికా సగటుతో సమానమని ఎన్‌‌ఎఫ్‌హెచ్‌ఎస్ తెలిపింది. అయితే దేశ సగటు మాత్రం మరీ దారుణంగా ఉంది. దేశంలో ప్రతి 1000కి 41 మంది మరణిస్తున్నారు. ప్రస్తుతం కేరళ శిశు మరణాల రేటు రష్యా, చైనా, శ్రీలంక, బ్రెజిల్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
Samayam Telugu kerala as good as us oecd in saving newborn children
శిశు మరణాల రేటులో అమెరికాతో సమానంగా కేరళ!


2005-06 ఏడాదిలో నవజాత శిశు మరణాల రేటు 15 ఉన్న కేరళ ప్రస్తుతం 6కు తగ్గించడానికి చాలా శ్రమించింది. 2009లో 12 గా మన్న ఈ మరణాల రేటును సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గడానికి దశాబ్ద కాలం పట్టింది. దేశంలోని మరే రాష్ట్రాలు అందుకోలేనంత దూరంలో కేరళ నిలిచింది. దీని తర్వాతి స్థానంలో 21 మరణాలతో తమిళనాడు నిలిచింది.

ఐఎంఆర్ రేటు కొన్నేళ్లుగా 10 కి తగ్గుతుందని భావించినా, నాటకీయంగా 6 కు తగ్గడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శిశు మరణాలో సుమారు 60 శాతం నవజాత శిశువులే అంటే పుట్టిన 28 రోజుల్లోనే చనిపోవడం. పోషకాహర లోపం, ఎదుగుదల లేకపోవడం, శ్వాసావరోధాలు లాంటివి ఈ మరణాలకు ప్రధాన కారణం. వీటిని నివారించడానికి 2000 ఏడాదిలోనే కేరళ లక్ష్యాలను నిర్దేశించుకుంది. గత ఏడేనిమిదేళ్లుగా తీవ్రంగా శ్రమించి శిశు మరణాలను అరికట్టగలిగింది.

కేంద్రం ఇచ్చే నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో నవజాత శిశు రక్షణ, స్థిరీకరణ యూనిట్లను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కేంద్రం సహాయంతో నవజాత శిశు సురక్ష కార్యక్రమం కింద శిక్షణ పొందిన నర్సులను ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నియమిస్తుంది. ఇలాంటి చర్యలతోనే శిశు మరణాల రేటు 12 నుంచి 6 తగ్గించగలిగామని డాక్టర్ నాయర్ తెలిపారు.

మన తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నా కేరళతో పోల్చుకుంటే భారీ వ్యత్యాసం ఉంది. తెలంగాణలో ఈ సంఖ్య 28 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 35గా ఉంది. శిశు మరణాల రేటు తగ్గడానికి కేంద్రం సహకారంతో కేరళ చేసిన కృషి అద్వితీయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.