యాప్నగరం

ఫాదర్ అత్యాచారాన్ని సమర్థించుకున్న చర్చి

అత్యాచారం ఎవరిపై జరిగినా అదో క్షమించరాని నేరం. అందులోనూ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ బాధితురాలిని...

TNN 6 Mar 2017, 10:28 am
అత్యాచారం ఎవరిపై జరిగినా అదో క్షమించరాని నేరం. అందులోనూ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ బాధితురాలిని తల్లిని చేయడం అంతకన్నా దారుణం. కానీ కేరళలోని క్యాథోలిక్ బిషప్స్ కౌన్సిల్ తీరు చూస్తోంటే, అది వారికి అంత తప్పుగా అనిపించినట్టు కనిపించడంలేదు. కేరళలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెని తల్లిని చేసిన ఓ చర్చి ఫాదర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu kerala church backs rape accused and justifies rape as an exception
ఫాదర్ అత్యాచారాన్ని సమర్థించుకున్న చర్చి


ఫాదర్ చేసిన ఈ తప్పిదాన్ని తప్పు అని చెప్పి అతడిపై చర్యలు తీసుకోవాల్సిన కేరళ క్యాథోలిక్ బిషప్స్ మండలి మాత్రం అతడు (ప్రీస్ట్) కూడా మనిషేనని, అతడికీ కోరికలు వుంటాయని చెప్పి ప్రీస్ట్ చేసిన ఘోర తప్పిదాన్ని వెనకేసుకొచ్చింది. ఫాదర్ విషయంలో వాళ్లు వ్యవహరించిన తీరు చూసి షాక్ అవడం సభ్య సమాజం వంతయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.