యాప్నగరం

యువజన సంఘాల్లో ఎక్కువ మంది తాగుబోతులే : కేరళ మంత్రి

కేరళ మంత్రి గోవిందన్ యువజన సంఘాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. సంఘాల్లోనే చాలామంది తాగుబోతులున్నారన్నారు. మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ, యువకులు, విద్యార్థి సంఘాల్లో మద్యపానం చేసే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను ఎవరిని లక్ష్యం చేసుకుని మాట్లాడడం లేదన్నారు. అదే సందర్భంలో మత్తు పదార్థాలపై అందరిని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీల్లో, హైస్కూల్స్ కూడా అందరిని జాగృతం చేయాలన్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 26 Jun 2022, 8:25 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి గోవిందన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • మద్యంపై అందరికీ అవగాహన కల్పించాలని పిలుపు
  • కేరళకు భారీ మొత్తంలో డ్రగ్స్ వస్తున్నాయన్న మంత్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu యువజన సంఘాల్లో ఎక్కువమంది తాగుబోతులే : కేరళ మంత్రి
కేరళకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. దీనికి కేరళ ఎక్సైజ్ మంత్రి ఎంవీ గోవిందన్ అథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్, మద్యం విషయంలో అందరికి అవగాహన కల్పించి, చైతన్య పరచాలన్నారు. ఇదే సమయంలో యువజన, విద్యార్థి సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలపై జాగృతం చేయాల్సిన యువజన సంఘాల్లోనే చాలామంది తాగుబోతులున్నారని అన్నారు.
"రాష్ట్రంలోని వివిధ యువజన సంఘాల విద్యార్థుల్లో ఎక్కువ మంది తాగుబోతులని నేను గమనించాను." అని మంత్రి గోవిందన్ అన్నారు. "ఇటీవల యువజన సంఘాల సహకారంతో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాం. కానీ నిశితంగా పరిశీలిస్తే, సంస్థలలో మంచి సంఖ్యలో యువత మద్యానికి బానిసలు అని తేలింది. మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ, యువకులు, విద్యార్థి సంఘాల్లో మద్యపానం చేసే వారి సంఖ్య పెరుగుతోంది, నేను ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అనడం లేదు" అని గోవిందన్ అన్నారు.

అలాగే కేరళ డ్రగ్స్‌ హబ్‌గా మారిందని మంత్రి గోవిందన్ చెప్పుకొచ్చారు. భారీ మొత్తంలో డ్రగ్స్ కేరళకు చేరుతున్నాయని, ఇటీవల కొచ్చి తీరంలో సముద్రంలో బోటులో రూ.1,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని ఆయన చెప్పారు. కేరళతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్రకు కూడా సముద్ర మార్గంలో డ్రగ్స్‌ రవాణా అవుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఏదిఏమైనా మద్యంపై కొత్త తరానికి నిజాయితీ నిబద్ధతతో అవగాహన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అలాగే వృత్తిపరమైన సంస్థలతో సహా హయ్యర్ సెకండరీ, హైస్కూల్, కాలేజీల్లోని విద్యార్థులు అవగాహన కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని గోవిందన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.