యాప్నగరం

రూ.700 కోట్ల సాయంపై కేరళాకు యూఏఈ షాక్!

వరదల బీభత్సంతో అల్లకల్లోలమైన కేరళను ఆదుకోడానికి ముందుకొచ్చిన యూఏఈ ప్రభుత్వం.. శుక్రవారం ఆ రాష్ట్రానికి షాకిచ్చింది.

Samayam Telugu 24 Aug 2018, 11:29 pm
రదల బీభత్సంతో అల్లకల్లోలమైన కేరళను ఆదుకోడానికి ముందుకొచ్చిన యూఏఈ ప్రభుత్వం.. శుక్రవారం ఆ రాష్ట్రానికి షాకిచ్చింది. ఆర్థిక సాయంపై కేరళ, కేంద్రం మధ్య వాడీవేడి వాదోపవాదనలు సాగుతున్న నేపథ్యంలో యూఏఈ ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళకు అందించే ఆర్థిక సాయంపై నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా నిర్ణయించలేదని చెప్పింది.
Samayam Telugu Untitledaa


‘‘కేరళకు అందించాల్సిన ఆర్థిక సాయంపై మా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడ జరిగిన నష్టానికి ఎంత మొత్తాన్ని విరాళాన్ని అందివ్వాలనే విషయంపై అంచనాలు సాగుతున్నాయి’’ అని గల్ఫ్ రాయబారి అహ్మద్ అల్బన్నా తెలిపారు. ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడిన ఆయన కేరళకు ఆర్థిక సాయం జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేరళకు యూఏఈ రూ.700 కోట్లు ప్రకటించిన మాట వాస్తవం కాదా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ఔను, నిజం కాదు. ఎంత ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు’’ అని తెలిపారు.

ఆగస్టు 21న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావెద్ అల్ నమాన్ కేరళకు రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రటించారని వెల్లడించారు. అయితే, ఈ మొత్తాన్ని స్వీకరించేందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో కేరళ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. వరదల వల్ల కేరళలో రూ.2వేల కోట్లు పైగా నష్టం వాటిల్లింది. అయితే, కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేవలం రూ.600 కోట్లు మాత్రమే ప్రకటించింది. అయితే, కేంద్రం బయట దేశాలిచ్చే భారీ ఆర్థిక సాయాన్ని తీసుకోబోదనే సంకేతాలు ఇవ్వడం వల్లే యూఏఈ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.