యాప్నగరం

వీడియో: కేరళ జల విలయం.. నష్టం ఎన్ని కోట్లంటే!

భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 80 శాతానికి పైగా భూభాగం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది.

Samayam Telugu 19 Aug 2018, 1:05 am
భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 80 శాతానికి పైగా భూభాగం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎడతెగని వర్షాల కారణంగా ఇప్పటివరకు 324 మంది మృతిచెందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల కారణంగా 3.14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు్న్నారు. 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో వేలాది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Samayam Telugu kerala


భారీ వర్షాలు, వరదల బీభత్సం కారణంగా కేరళలో ఇప్పటివరకు రూ. 19,512 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి తెలిపారు. విజయన్‌తో కలిసి ప్రధాని మోదీ శనివారం (ఆగస్టు 18) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మోదీ కేరళకు రూ. 500 కోట్లు తక్షణ సాయంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు.

ఇంట్లో శవం... ఇంటి చుట్టూ నీరు
వరద ప్రభావిత ప్రాంతాల్లో దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కపెడుతున్నారు. వేలాది మంది ‘రక్షించండి.. రక్షించండి’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలసి సొలసిపోయారు. కోచి ప్రాంతంలోనే 10 వేల మంది వరద బాధితులు సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
పతనమిత్తట్ట జిల్లాలోని అరాన్‌ములాలో ఓ ఇల్లు మొదటి అంతస్తువరకూ నీళ్లు చేరాయి. మొదటి అంతస్తులో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహంతో పడిగాపులు కాస్తున్నారు. మరో ఇంట్లో శవపేటిక వరదలో కొట్టుకుపోకుండా దానికి తాడు కట్టి మృతదేహాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పదుల సంఖ్యలో నెలలు నిండిన మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిని ఆస్పత్రులకు తరలించేందుకు సాహాయ చర్యలు సరిపోవడం లేదు. ‘సాయం చేయండి’ అంటూ అత్యవసర సహాయ కేంద్రాలకు వరదలా ఫోన్లు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.