యాప్నగరం

వీడియో: సంప్రదాయ పూజలతో ఫ్లైఓవర్ కూల్చివేత..

Kochi: హంగూ ఆర్భాటాలతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను కూల్చివేసే పనులు మొదలు పెట్టారు. అంతకంటే ముందు సంప్రదాయ పూజలు చేశారు. కేరళలోని కొచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఎందుకు, ఏమిటో చూడండి..

Samayam Telugu 29 Sep 2020, 8:50 pm
కీలకమైన వంతెన అది. కానీ, తప్పనిసరిగా కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పనులను పూజ చేసి మరీ ప్రారంభించారు. కేరళలోని కొచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూల్చేసిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.
Samayam Telugu సంప్రదాయ పూజలతో వంతెన కూల్చివేత
Kochi Palarivattom flyover demolition


కొచ్చిలో పలరివట్టోమ్ ఫ్లైఓవర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించింది. 2016 అక్టోబర్‌లో ఈ వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ, ప్రారంభమైన కొన్ని రోజులకే నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. దీంతో 2019 మే నుంచి ఫ్లైఓవర్‌ను మూసేశారు.

వంతెన నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు అధికారులు గుర్తించారు. మరమ్మతు పనులను ఏవిధంగా చేయాలనే అంశానికి సంబంధించి నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్‌ను పరిశీలించిన నిపుణుల బృందం.. దానికి మరమ్మతు చేపట్టే కంటే కూల్చివేసి కొత్తగా నిర్మించడమే సురక్షితమని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. కానీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా వంతెనను కూల్చివేసి కొత్తగా నిర్మాణం చేపట్టే ప్రక్రియ జాప్యమైంది.

Must Read: కరోనాకు ఆయుర్వేదంతో అద్భుత ఫలితాలు..

ఫ్లైఓవర్‌ను కూల్చేయడానికి కేరళ ప్రభుత్వానికి సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చింది. వంతెనను పూర్తిగా కూల్చివేసి నాణ్యతతో కొత్త వంతెనను నిర్మించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.

ఈసారి ఎలాంటి తేడా రాకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మెట్రోమ్యాన్ ఇ శ్రీధరన్‌కు అప్పగించింది. ఏడాదిలోగా కొత్త వంతెనను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పినరయి విజయన్ ప్రభుత్వం భావిస్తోంది. సంప్రదాయ పూజల అనంతరం ఫ్లైఓవర్ కూల్చివేత పనులు ప్రారంభించిన దృశ్యాలను వీడియోలో వీక్షించవచ్చు.

Also Read: నీటి కోసం కొండను తవ్వారు.. 250 మంది మహిళలు, 18 నెలలు

Don't Miss: కుమారుడికి జాగ్రత్తలు చెప్పి గొంతు కోసుకున్న కరోనా రోగి.. సీసీ కెమెరాల్లో ఆ దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.