యాప్నగరం

నీటి మీద తేలే సోలార్ ప్లాంట్!

దేశంలోనే తొలిసారిగా నీటి మీద తేలే సోలార్ పవర్ ప్లాంట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో.. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

TNN 20 Oct 2017, 6:36 pm
సౌర (సోలార్) విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే మాటలు కాదు. దాని కోసం భారీ స్థాయిలో స్థల సేకరణ చేయాలి. అయితే, కేరళాలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్‌కు ఆ సమస్య లేదు. ఎందుకంటే.. దాన్ని రిజర్వాయరుపై ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ దేశంలోనే అతి పెద్దది, పొడవైనది కూడా. దాదాపు 6వేల చదరపు మీటర్ల నీటిపై.. తేలియాడే ఈ సోలార్ ప్లాంట్ ద్వారా 100 kWp విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.
Samayam Telugu kerala gets indias largest floating solar plant
నీటి మీద తేలే సోలార్ ప్లాంట్!


ఈ ప్రాజెక్టు కోసం రూ.925 కోట్లు వెచ్చించారు. కేరళాలోని బనసురా సాగర్ రిజర్వాయర్‌పై నిర్మించిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రపంచంలో అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చైనాలో ఉంది. ఇక్కడ 40 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

నీటిపై తేలేందుకు అనువుగా ఫెర్రోసిమెంట్ ఫ్లోటర్లను వినియోగించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 7.5 లక్షల యూనిట్ల విద్యుత్తును అందించాలనేది లక్ష్యం. పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు అండర్ వాటర్ కేబుళ్ల ద్వారా ఈ విద్యుత్తును అందిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.