యాప్నగరం

కేరళ నన్ రేప్ కేసు: ఫాదర్ కురియకోస్ అనుమానాస్పద మృతి

కేరళ నన్ రేప్ కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన ఫాదర్ కురికోస్ కుట్టుథారా (67) సోమవారం ఉదయం జలంధర్‌లో ఆకస్మికంగా మృతి చెందారు.

Samayam Telugu 22 Oct 2018, 1:57 pm
కేరళ నన్ రేప్ కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన ఫాదర్ కురికోస్ కుట్టుథారా (67) ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం ఉదయం జలంధర్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బిషప్ ఫ్రాంకోస్ ములక్కల్‌కు వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకే తన సోదరుడి హత్య చేశారని జోస్ కట్టుథారా ఆరోపించారు.
Samayam Telugu father kuriakose


నన్‌కు మద్దతుగా నిలవడంతో చర్చి అధికారుల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని ఫాదర్ కురియకోస్ ఇదివరకే తెలిపారు. బిషప్‌పై ఫిర్యాదు చేయడానికి సిస్టర్స్ తనను కలిశారని కురియకోస్ గతంలో తెలిపారు. బిషప్ అంటే భయపడి వారు పోలీసులను ఆశ్రయించలేదన్నారు.

ఫాదర్ కురియకోస్ జలంధర్‌ డయాసిస్‌లో వొకేషనల్ టీచర్‌గా పని చేసేవారు. న్యాయం కోసం పోరాడుతున్న నన్‌లకు కూడా ఆయన గురువు. బిషప్ ఫ్రాంకో కేసులో ఫాదర్ కురియకోస్‌ను సాక్షిగా విచారించామని ఎస్పీ హరిశంకర్ తెలిపారు. ఫాదర్ కురియకోస్ మరణ వార్త విని షాకయ్యామని సిస్టర్ అనుపమ తెలిపారు. బిషప్‌‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. బిషప్ కేసులో ఆయన కీలక సాక్షి అని సిస్టర్ అనుమప చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.