యాప్నగరం

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో.. కోల్‌కతా కుర్రోడు!

ఆయన విజయం సాధించి, సంచలనం సృష్టించాలని.. ఇప్పుడు కోల్‌కతా నగరవాసులతో పాటు యావత్ భారతదేశం ఆశిస్తోంది.

TNN 4 May 2017, 4:00 pm
కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన రోహిత్ దాస్ గుప్తా యూకేలో లేబర్ పార్టీ తరఫున ఈస్ట్ హాంప్‌షైర్ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటిష్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, సొంతిళ్లు, ఆరోగ్యం, అందరికీ బేసిక్ మినిమమ్ సాలరీ అనే అంశాలే ఎజెండాగా ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నారు. జూన్ 8న జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఫేస్‌బుక్ ద్వారా మద్దతు కోరుతూ.. సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు.
Samayam Telugu kolkata boy rohit dasgupta contesting in uk parliament elections 2017 on labour party ticket
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో.. కోల్‌కతా కుర్రోడు!


వామపక్ష భావజాలంపై విశ్వాసం ఉన్న రోహిత్.. ఇండియా, యూకేలో వేళ్లూనుకున్న ఫండమెంటలిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోల్‌కతాతో దగ్గరి బంధం పెనవేసుకున్న ఓ వ్యక్తి యూకే ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే.. ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలుపొందడం అంత తేలికేం కాదు. 2010 నుంచి అక్కడ బలంగా పాతుకుపోయిన కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డామియన్ హిండ్స్‌ను ఓడించడం కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఏదేమైనా ఆయన విజయం సాధించి, సంచలనం సృష్టించాలని.. ఇప్పుడు కోల్‌కతా నగరవాసులతో పాటు యావత్ భారతదేశం ఆశిస్తోంది.
Read this in Bengali

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.