యాప్నగరం

కుల్‌భూషణ్ ఉరి కేసు: రేపు ఐసీజే తీర్పు

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌జాదవ్‌ కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్ష కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం

Samayam Telugu 17 May 2017, 6:44 pm
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌జాదవ్‌ కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్ష కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నెషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసీజే) గురువారం తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. రేపు (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఐజీజే తీర్పు వెల్లడించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Samayam Telugu kulbhushan case icj to pronounce its verdict tomorrow
కుల్‌భూషణ్ ఉరి కేసు: రేపు ఐసీజే తీర్పు


#ICJ order on #KulbhushanJadhav case to be announced tomorrow at 3:30 PM (IST), govt sources say.— Press Trust of India (@PTI_News) May 17, 2017

గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాకిస్థాన్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిం.

కుల్‌భూషణ్‌ను ఉరితీస్తే అది కుట్రపూరిత హత్యే అవుతుందని భారత్‌ ఉరిశిక్షను ఖండించింది. కుల్‌భూషణ్‌ను కలిసేందుకు కాన్సులర్‌ యాక్సెస్‌ ఇవ్వాలని పాక్‌ను పదేపదే కోరినా ఫలితం దక్కలేదు. దీంతో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసుపై ఐసీజే సోమవారం విచారణ చేపట్టింది. ఇరు దేశాలు (భారత్-పాక్) వాదనలు విన్న ఐసీజే రేపు తీర్పు వెల్లడించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.