యాప్నగరం

ఖైదీ నెంబర్ 10711: శశికళ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులోని స్పెషల్ కోర్టు ఎదుట లొంగిపోయిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకి...

TNN 15 Feb 2017, 6:51 pm
బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులోని స్పెషల్ కోర్టు ఎదుట లొంగిపోయిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకి జైలు అధికారులు ఖైదీ నెంబర్లని కేటాయించారు. శశికళకి ఖైదీ నెంబర్ 10711, ఇళవరసికి ఖైదీ నెంబర్ 10712 కేటాయించారు. జైలులో తమకి ప్రత్యేక వసతులు కావాలని శశికళ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో శశికళ ఇక సాధారణ ఖైదీగానే జైలు శిక్ష అనుభవించనున్నారు.
Samayam Telugu late jayalalithaas fans pelt stones on sasikalas convoy at banglore jail
ఖైదీ నెంబర్ 10711: శశికళ కాన్వాయ్‌పై రాళ్ల దాడి


ఇదిలావుంటే, పరప్పణ అగ్రహార జైలుకి చేరుకున్న శశికళ కాన్వాయ్‌పై దివంగత సీఎం జయలలిత అభిమానులు దాడికి పాల్పడ్డారు. శశికళ ప్రయాణిస్తున్న వాహనాల శ్రేణిపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు ఆమెకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శశికళ రాకతో జైలు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. అక్కడే వున్న పోలీసులు ఆందోళనకారులని నిలువరించడంతో ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.