యాప్నగరం

సిగరెట్లు వెలిగించి శివుడికి పూజలు.. భక్తి చాటుకుంటున్న జనం

Cigarettes తో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతున్నాయనేది ఇక్కడి భక్తులు నమ్ముతున్నారు.

Samayam Telugu 21 Feb 2020, 10:41 pm
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు వెలిగించి అగరుబత్తులు వెలిగించారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గుడిలో ఇందుకు విరుద్ధంగా మహా శివరాత్రి నిర్వహిస్తున్నారు.
Samayam Telugu Capture1


Must Read: ఎగిరే వైట్ హౌజ్.. ఎయిర్ ఫోర్స్ వన్.. మీరు ఆశ్చర్యపడే ఆసక్తికర నిజాలు..


Also Read: ట్రంప్ భారత పర్యటన.. చిలుకూరు బాలాజీకి పెద్ద ఎత్తున పూజలు

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో మాత్రం వింత ఆచారం ఏళ్లుగా అమలులో ఉంటోంది. జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇతర ఆలయాల్లోలాగా అగరుబత్తులను వెలిగించకుండా, భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే, ఇక్కడ భక్తుల విశ్వాసం మరోటి ఉంది. సిగరెట్లను గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతున్నాయనేది ఇక్కడి భక్తులు నమ్ముతున్నారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి.

Also Read: కోమటిరెడ్డికి అమెరికాలో కీలక పదవి.. నామినేట్ చేసిన ట్రంప్

Must Read: శివ లింగానికి రోజూ అభిషేకం చేస్తున్న పాములు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.