యాప్నగరం

నితీశ్ ఓటమిని కాంక్షిస్తూ చిరాగ్ నాయకత్వంలోని ఎల్జేపీ హోమాలు!

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... అధికార జేడీయూ, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీచేయగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.

Samayam Telugu 10 Nov 2020, 9:33 am
బీహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఎన్డీయే, మహాకూటమి మధ్య హోరాహోరీ పొరు నెలకుంది. ఈ నేపథ్యంలో తమ విజయాన్ని కాంక్షిస్తూ రాజకీయ పార్టీలు హోమాలు, పూజలు నిర్వహిస్తున్నాయి. ఇదే సమయంలో నితీశ్ కుమార్ ఓటమిని కోరుతూ యువనేత చిరాగ్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ప్రత్యేక పూజలు ప్రారంభించింది.
Samayam Telugu బిహార్‌లో ఎల్జేపీ నేత హోమం


నితీష్ విముక్త ప్రభుత్వం కోసం వివిధ ఆలయాల్లో పూజలు, హోమాలు చేపట్టింది. మధ్యాహ్నం కల్లా ఎవరు గెలవనున్నదీ స్పష్టం కానుంది. ఎల్జేపీ నేత కృష్ణకుమార్ కల్లూ తన పార్టీ అఖండ విజయం సాధించాలని పట్నాలో హోమం నిర్వహిస్తున్నారు. అలాగే నితీష్ విముక్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన ప్రార్థించారు.

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మహాఘటబంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆర్జేడీ 92, బీజేపీ 55, జేడీయూ 50, కాంగ్రెస్ 21, ఎల్జేపీ 4, ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పట్నాలోని తేజస్వీ ఇంటి ముందు కార్యకర్తల కోలహలం కనిపించింది.

యువకులు తేజస్వీ చిత్రపటాలు, ఆర్జేడీ జెండాలతో ఆయన ఇంటి ముందు సంబరాలు చేసుకున్నారు. లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్‌లు ఆధిక్యంలో కొనసాగడంతో కార్యకర్తలు విజయోత్సవ నినాదాలు చేశారు. నృత్యం చేస్తూ తేజస్వీ ఇంటి ముందు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.