యాప్నగరం

పెద్దాయన మళ్లీ సీరియస్, రాజీనామా వార్నింగ్

బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు ఎల్.కె.అద్వానీ మళ్లీ సీరియస్ అయ్యారు. పార్లమెంటు

TNN 15 Dec 2016, 2:14 pm
బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు ఎల్.కె.అద్వానీ మళ్లీ సీరియస్ అయ్యారు. పార్లమెంటు తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కనీసం ముగిసే చివరి రోజుల్లోనైనా సజావుగా సాగేలా ప్రతిపక్షాలతో మాట్లాడాలని ఆయన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సూచించారు.
Samayam Telugu lk advani upsets over parliament logjam warns resigns
పెద్దాయన మళ్లీ సీరియస్, రాజీనామా వార్నింగ్


నోట్లరద్దుపై పార్లమెంటు ప్రారంభమైన నవంబర్ 16 నుంచి ఏలాంటి చర్చలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. దీనిపై గతవారం ఎల్.కె.అద్వానీ సీరియస్ అయ్యారు. సభ సజావుగా నడిపలేకపోతున్నారని ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లపై సీరియస్ అయ్యారు.

‘చీటికిమాటికీ వాయిదా పడుతున్న పార్లమెంటుతో నన్ను కలిచి వేస్తోంది. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనిపిస్తోంది’ అని ఎల్.కె.అద్వానీ గురువారం వ్యాఖ్యానించారు.

పార్లమెంటు నిర్వహణపై మాజీ ప్రధాని వాజ్‌పేయ్ హయం గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన పరోక్షంగా మోదీకి సూచించారు. వాజ్ పేయ్ ప్రస్తుతం పార్లమెంటులో ఉండి ఉంటే తీవ్రంగా కలత చెందేవారని అద్వానీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.