యాప్నగరం

రిసెప్షనిస్ట్ అంకిత హత్యపై ఆగ్రహం.. హైవేపై ఆందోళన.. అంత్యక్రియలు నిర్వహించమన్న తండ్రి

రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య.. ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) సంచలనం సృష్టించింది. ఈ కేసులో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు స్థానికులు బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. హైవేపై బైఠాయించి.. నిరసన చేపట్టారు. అమ్మాయి అంత్య క్రియలు నిర్వహించమని తండ్రి, సోదరుడు పట్టుబట్టారు. దాంతో పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి.. వారికి సర్ది చెప్పారు. మరోవైపు ఆమెను బలవంతంగా వ్యభించారంలోకి దించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆమె వాట్సాప్ చాట్‌లు కూడా బయటకొచ్చాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 25 Sep 2022, 5:30 pm

ప్రధానాంశాలు:

  • ఉత్తరాఖండ్‌లో స్థానికుల ఆందోళన
  • రహదారిపై బైఠాయించి నిరసన
  • బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ankita Murder Case
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) రిసార్ట్‌ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ హత్యకు గురైన అంకితా భండారీ (19) కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నాయకుడు కొడుకు పులికిత్ ఆర్యాని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులు ఆమె కాలువలోకి తోసేసినట్టు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. ఈ కేసులో ఎన్నో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆమెతో బలవంతం వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమె వాట్సాప్ చాట్ కూడా బయటకొచ్చింది.
స్థానికుల ఆగ్రహం..
మరోవైపు అంకితా భండారీ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ వీధుల్లోకి వచ్చారు. పోస్ట్‌మార్టం నివేదికను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ బద్రీనాథ్-రిషికేశ్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని బ్లాక్ చేసి.. నిరసన తెలియజేశారు. స్థానికులు సంఘీభావం తెలపడంతో ఆదివారం స్థానిక మార్కెట్‌ను మూసివేశారు. శ్రీనగర్‌లోని వ్యాపారులు తమ వ్యాపార సంస్థలను కూడా క్లోజ్ చేశారు. అలాగే నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.


అదే విధంగా అంకిత తండ్రి, సోదరుడు అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించారు. వెంటనే అంకిత పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఆమె పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు మేము ఆమె అంత్యక్రియలు నిర్వహించం. ఆమెను కొట్టి నదిలో పడేసినట్టు తాత్కాలిక నివేదికలో చూశాం. అయితే ఫైనల్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం." అని అంకితా భండారీ సోదరుడు అజయ్ సింగ్ భండారీ తెలిపారు. అంకితా భండారీ అంత్యక్రియల నిర్వహణపై జిల్లా అధికారులు, పోలీసులు చర్చలు జరిపారు. ఈ మేరకు అంకితాభండారి తండ్రి ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.


మరోవైపు అంకితా భండారి వాట్సాప్ చాట్‌లు కూడా బయటకొచ్చాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ చాట్‌లో.. అతిథులకు స్పెషల్ సర్వీస్ అందించమని రిసార్ట్ యజమాని తనపై ఒత్తిడి చేస్తున్నాడని అంకిత తన స్నేహితుడికి చెప్పింది. దీంతో నిందితులై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంకోవైపు అంకిత భండారీ స్నేహితుడిని ఈ కేసులో దోషిగా మార్చే ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.