యాప్నగరం

లోక్‌సభ సోమవారానికి వాయిదా!

అవిశ్వాస తీర్మానంతో హీటెక్కుతుందని అనుకున్న లోక్ సభ అనూహ్యంగా వాయిదా పడింది.

Samayam Telugu 16 Mar 2018, 12:35 pm
అవిశ్వాస తీర్మానంతో హీటెక్కుతుందని అనుకున్న లోక్ సభ అనూహ్యంగా వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ అంశం చర్చకు వస్తుందని అనుకుంటే.. సభ వాయిదా పడింది. లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తూ ప్రకటన చేశారు స్పీకర్ సుమిత్రామహాజన్.
Samayam Telugu lok sabha adjourned for the day
లోక్‌సభ సోమవారానికి వాయిదా!


అవిశ్వాస తీర్మానంపై ఆమె స్పందన ఈ విధంగా ఉంది.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తెలుగుదేశం ఎంపీ తోట నరసింహంలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు మాకు అందాయ్. సోమవారం సభలో పరిస్థితి అనుకూలంగా ఉంటే.. వీటిని చర్చకు తీసుకుంటాం. సభలో ప్రశాంత పరిస్థితి ఉంటేనే.. వీటిపై చర్చ జరుగుతుంది..’ అని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.

లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ అంశాలపై సభలో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు ఎంపీలు నిలబడి నిరసనలు తెలపడం, స్పీకర్ వెల్ వద్దకు వచ్చి నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో.. అలాంటి పరిస్థితి లేకుంటేనే.. సభలో అవిశ్వాసం అంశం చర్చకు వస్తుందని.. స్పీకర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.