యాప్నగరం

ఆ రోడ్డుపై వెళ్లడం ఓ నరకం...

వర్షం పడితే మన రోడ్లు జలపాతాలు అవుతాయని తెలుసు...

TNN 30 Jul 2016, 9:58 am
వర్షం పడితే మన రోడ్లు జలపాతాలు అవుతాయని తెలుసు... ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగి గంటలు గంటలు వాహనాలు ఆగిపోతాయి. ఎంతదూరమైనా... ఇక్కడ ఎలాగో మూడు నాలుగ్గంటల్లో ఇంటికి చేరుకుంటాం. అదే ఢిల్లీలోని కొన్ని రోడ్లపై అయితే ఇంటికి చేరడానికి ఒక పూట పడుతోంది. ఢిల్లీ - గురుగ్రామ్ ఎక్స్ ప్రెస్ హైవే పరిస్థితి దారుణంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. గురువారం సాయంత్రం ఆఫీసు విధులు ముగించుకున్న ఉద్యోగి శుక్రవారం తెల్లవారు జాముకి ఇంటికి చేరుకున్నాడంటే ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేక ఆఫీసులకు, స్కూళ్లకు ఓ రెండు రోజులు సెలవులు ఇవ్వమని అడిగారు. గురు, శుక్రవారాలు వర్షాల కారణంగా అక్కడి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో కూడిన బృందాన్ని పంపి మరీ ట్రాఫిక్ క్లియర్ చేయించారు.
Samayam Telugu long jams on delhi gurugram express highway
ఆ రోడ్డుపై వెళ్లడం ఓ నరకం...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.