యాప్నగరం

కరోనాతో కొత్త లక్షణాలు.. వీటితోనూ అనుమానించాల్సిందే.. కేంద్రం ప్రకటన

Coronavirus Cases in India: కొవిడ్-19 అనే ప్రత్యేక డాక్యుమెంట్‌లో ఈ వివరాలను ప్రచురించారు. ఈ ప్రత్యేక పత్రాన్ని దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల సందేహ నివృత్తి కోసం అందించనున్నారు. ఇక, కరోనా వ్యక్తి నుంచి వ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా ఈ డాక్యుమెంట్‌లో నిర్వచించారు.

Samayam Telugu 13 Jun 2020, 8:45 pm
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింతగా వేగం పుంజుకుంటోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 3 లక్షలు దాటింది. ఈ క్రమంలో కరోనా పరీక్షలకు చేసేందుకు ప్రామాణికమైన అంశాల్లో మరో రెండు లక్షణాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేర్చింది. అకస్మాత్తుగా రుచి, వాసన చూసే గ్రాహణ శక్తిని కోల్పోతే అది కరోనా కావొచ్చని కేంద్రం నిర్దేశించింది. ఇప్పటి వరకూ జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కరోనా లక్షణాలుగా పేర్కొంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Loss of smell and taste added to list of coronavirus symptoms says Health Ministry


ఇకపై వీటికి అదనంగా ఉన్నట్టుండి వాసన, రుచి చూసే శక్తి కోల్పోవడాన్ని కూడా కరోనా లక్షణంగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో కరోనా లక్షణాల జాబితాలో రుచి, వాసన చూసే సామర్థ్యం లేకపోవడం కూడా వచ్చి చేరడంలో కరోనా లక్షణాల సంఖ్య 15కు చేరింది.

Must Read: undefined

కొవిడ్-19 అనే ప్రత్యేక డాక్యుమెంట్‌లో ఈ వివరాలను ప్రచురించారు. ఈ ప్రత్యేక పత్రాన్ని దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల సందేహ నివృత్తి కోసం అందించనున్నారు. ఇక, కరోనా వ్యక్తి నుంచి వ్యక్తికి నేరుగా ఎలా సోకుతుందో కూడా ఈ డాక్యుమెంట్‌లో నిర్వచించారు. ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, ప్రధానంగా ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లతో వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లు ఏదైనా ప్రదేశంపై పడితే, ఆ ప్రదేశాన్ని ఎవరైనా తాకి, ఆ చేతిని కళ్ల వద్ద, ముక్కు, నోటి వద్ద తాకించినా కరోనా సోకుతుందని వివరించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.