యాప్నగరం

జయలలిత ‘కొడుకు’ను అరెస్ట్ చేయండి

జయలలిత తనయుడినంటూ కోర్టుకెక్కిన జె.కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ సోమవారం

TNN 27 Mar 2017, 3:44 pm
జయలలిత తనయుడినంటూ కోర్టుకెక్కిన జె.కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జె.కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దివంగత సీఎం జయలలిత తెలుగు సినీ నటుడు శోభన్ బాబులు తనకు తల్లిదండ్రులని... తనపేర జయ వీలునామా కూడా రాశారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లాడు.
Samayam Telugu madras hc orders action against jayalalithaas son
జయలలిత ‘కొడుకు’ను అరెస్ట్ చేయండి


కృష్ణమూర్తి సమర్పించిన ‘వీలునామా’ను పరిశీలించిన జస్టిస్ ఆర్ మహదేవన్...అవి తప్పుడు ధృవీకరణ పత్రాలను గుర్తించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కోర్టు సమయం వృథా చేయడంతో పాటు జయలలిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన కృష్ణమూర్తిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

‘అతడు కోర్టును మాత్రమే మోసం చేయలేదు. ఫోర్జరీ డాక్యూమెంట్లను కూడా సృష్టించాడు’’ మహదేవన్ అన్నారు.

కృష్ణమూర్తి కోర్టుకు సమర్పించి డాక్యూమెంట్లపై జయలలిత సంతకం (ఫోర్జరీ)తో పాటు ఆమె, శోభన్ బాబులు కలిసి దిగిన ఫొటోలున్నాయి. అయితే అతనిది తిర్పూర్ అని అక్కడే అసలైన తల్లిదండ్రులు కూడా ఉన్నారని క్రైం బ్రాంచ్ విచారణలో తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.