యాప్నగరం

అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వీడియో ఇవ్వండి: మద్రాస్ హై కోర్టు

తమిళనాడు అసెంబ్లీలో ఇటీవల పళనిసామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వీడియోను...

TNN 27 Feb 2017, 8:59 pm
తమిళనాడు అసెంబ్లీలో ఇటీవల పళనిసామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వీడియోను కోర్టుకి సమర్పించాల్సిందిగా మద్రాస్ హై కోర్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ ఓటింగ్ నియమనిబంధనలకి విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, అడ్వకేట్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు అడ్వకేట్ కే బాలు, సోషల్ యాక్టివిస్ట్ కేఆర్ ట్రాఫిక్ రామస్వామి వేర్వేరుగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Samayam Telugu madras hc seeks video of entire trust vote proceedings in tamilnadu assembly
అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వీడియో ఇవ్వండి: మద్రాస్ హై కోర్టు


నిబంధనలు ఉల్లంఘించి ఈ ఓటింగ్ చేపట్టినందున, కోర్టు ఈ తీర్మానాన్ని రద్దు చేయాల్సిందిగా పిటిషనర్లు తమ పిటీషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు.. 'ఓటింగ్ జరిగిన రోజు అసెంబ్లీ ప్రోసీడింగ్స్‌కి సంబంధించి, మొదటి నుంచి చివరి వరకు కవర్ చేసిన పూర్తి వీడియోను కోర్టుకి సమర్పించాల్సిందిగా' అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం మార్చి 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.