యాప్నగరం

మహద్ ఘటన: 4 మృతదేహాలు లభ్యం

సావిత్రి నదిపై బ్రిటిషర్ల కాలం నాటి వంతెన కూలిన ఘటనలో 29 మంది గల్లంతవగా, నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.

BCCL 4 Aug 2016, 11:50 am
సావిత్రి నదిపై బ్రిటిషర్ల కాలం నాటి వంతెన కూలిన ఘటనలో 29 మంది గల్లంతు కాగా, ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారంతా సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ముంబై-గోవా హైవేపై రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న ఓ పాత వంతెన భారీ వర్షాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. దీంతో ఆ వంతెనపై వెళుతున్న రెండు బస్సులతోపాటు ఇతర వాహనాలు కొట్టుకెళ్లాయి. రెండు బస్సుల్లో కలిపి 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుండగా, దాదాపు 29 మంది గల్లంతయ్యారని అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్స్, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 14 గంటలపాటు గాలింపు చర్యలు సాగగా.. నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మిగిలిన వారంతా సముద్రంలోకి కొట్టుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ముంబైకి 170 కిలోమీటర్ల దూరంలో మహాడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ విషయమై విచారణకు ఆదేశించారు. పాత వంతెన పక్కనే కొత్తది నిర్మించినప్పటికీ పాత వంతెన మీద రాకపోకలు సాగుతుడటంతో ఈ ప్రమాదం వాటిల్లింది.
Samayam Telugu mahad incident 4 dead bodies found
మహద్ ఘటన: 4 మృతదేహాలు లభ్యం



Mumbai-Goa highway bridge collapse UPDATE: Body of a woman recovered near Harihareshwar (Raigad). Death toll rises to four. — ANI (@ANI_news) August 4, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.