యాప్నగరం

మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా.. అంతకంటే గొప్ప పదవి!

Nana Patole: మహారాష్ట్ర స్పీకర్ నానా పటోలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 4 Feb 2021, 7:58 pm
హారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల కిందట ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించనున్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గురువారం (ఫిబ్రవరి 4) పటోలే తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు.
Samayam Telugu సీఎం ఉద్ధవ్‌తో పటోలే
Nana Patole


2019లో మహారాష్ట్రలోని శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నేత నానా పటోలేకు స్పీకర్ పదవి దక్కింది. ఆయన రాజీనామా విషయంపై మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ సమాచారం ఇచ్చింది.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన పటోలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 కమలం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2018లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.