యాప్నగరం

Maharashtra: ముఖ్యమంత్రి షిండే ప్రాణాలకు ముప్పు.. సెక్యూరిటీని పెంచిన అధికారులు

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి షిండే ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి భద్రతను పెంచారు. కాగా అక్టోబర్ ఐదో తేదీన ముంబైలో షిండే ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులు రావడంపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు షిండే మాత్రం తనకు రాష్ట్ర హోంశాఖపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఎలాంటి బెదిరింపులకు భయపడనని అన్నారు. ఈ నక్సలైట్ల నుంచే

Authored byAndaluri Veni | Samayam Telugu 2 Oct 2022, 9:32 pm

ప్రధానాంశాలు:

  • సీఎం షిండేకు బెదిరింపులు
  • భయపడేది లేదన్న ఏక్‌నాథ్ షిండే
  • అక్టోబర్ 5న ముంబైలో ప్రసంగించనున్న షిండే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu CM Eknath Shinde
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు ఉందన్న సమాచారంతో అధికారులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. శనివారం సాయంత్రం సీఎం షిండే ప్రాణాలకు ముప్పు ఉందని సమాచారం అందిందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ (SID) అధికారులు తెలియజేశారు. తమకొచ్చిన నిర్దిష్ట సమాచారం తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నామని, ముఖ్యమంత్రికి భద్రతను పెంచామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ డంబ్రే చెప్పారు.
ఇప్పటికే సీఎం షిండేకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందనే సమాచారంతో అదనపు భద్రత కల్పించారు. థానేలోని షిండే ఇంటి దగ్గర, ముంబైలోని అధికారిక నివాసం దగ్గర కూడా భద్రతను పెంచినట్టు అశుతోష్ డంబ్రే చెప్పారు. కాగా సీఎం షిండే దసరా ర్యాలీలో అక్టోబర్ 5న ముంబైలోని MMRDA గ్రౌండ్స్‌లో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులు రావడంతో నిఘా వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

అయితే తను ఎటువంటి బెదిరింపులకు భయపడనని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. భద్రతకు సంబంధించిన విషయాలు అధికారులు చూసుకుంటారని, తాను తన పని చేసుకుంటూ పోతానని ఆయన అన్నారు. అలాగే తనకు రాష్ట్ర హోం శాఖపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా షిండే శివసేన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో ఈ ఏడాది జూన్‌లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాగా షిండేకు ఇలాంటి బెదిరింపులు రావడం కొత్తేం కాదు. నక్సలిజం ప్రభావితమైన గడ్చిరోలి జిల్లా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సంరక్షక మంత్రిగా ఉన్నప్పుడు షిండేకు గత అక్టోబర్‌లో నక్సలైట్లు పంపినట్లు అనుమానిస్తున్న బెదిరింపు లేఖ వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.