యాప్నగరం

మహారాష్ట్ర: నాందేడ్ సహా మరో 2 జిల్లాల్లో లాక్‌డౌన్

మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మరో రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. నాందేడ్, బీడ్ జిల్లాల్లో ఏప్రిల్ 4 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు.

Samayam Telugu 25 Mar 2021, 10:54 am
హారాష్ట్రను కరోనా వైరస్ మళ్లీ వణికిస్తోంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా నాందేడ్ జిల్లాలో లాక్‌డౌన్ విధించింది. నాందేడ్ జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు బుధవారం (మార్చి 24) వెల్లడించారు. ఏప్రిల్ 4 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే బీడ్ జిల్లాలోనూ పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu కరోనా వైరస్
Coronavirus


మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపెట్టాలని అధికారులు నిర్దేశిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఈ తరహా ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలను అప్రమత్తం చేసింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.