యాప్నగరం

నా చావుకు మోదీనే కారణం: రైతు సూసైడ్ లెటర్

ఓ రైతు రాసిన సూసైడ్ లెటర్ సంచలనంగా మారింది. తన చావుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ఆ లేఖలో ప్రస్తావించడం కలకలంరేపింది.

Samayam Telugu 11 Apr 2018, 4:09 pm
ఓ రైతు రాసిన సూసైడ్ లెటర్ సంచలనంగా మారింది. తన చావుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ఆ లేఖలో ప్రస్తావించడం కలకలంరేపింది. మహారాష్ట్రలోని యవంతాల్ జిల్లా రాజుర్వాడికి చెందిన శంకర్ భౌరవ్... వ్యవసాయం కోసం రుణం కావాలంటూ బ్యాంకులు చుట్టూ తిరిగినా దొరకలేదు. చివరికి గవర్నమెంట్ సొసైటీ దగ్గర రూ.90వేలు రుణం తీసుకున్నాడు. డబ్బు సరిపోక వడ్డీ వ్యాపారి దగ్గర మరో రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో తన పొలానికి పెట్టుబడి పెట్టి పత్తి పంట వేశాడు. పంట ఏపుగా పెరిగి చేతికందే సమయానికి చీడ పట్టింది. పంట మొత్తం పూర్తిగా నాశనమయ్యింది.
Samayam Telugu Farmer Suicide


ప్రభుత్వం నుంచి రుణమాఫీ జరిగినా... శంకర్‌కు సొసైటీ నుంచి తీసుకున్న రూ.90వేలు మాత్రమే మాఫీ అయ్యాయి. వడ్డీ వ్యాపారి నుంచి తీసుకున్న రూ.3లక్షల అప్పు మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పును తీర్చే దారి కనిపించక తనలో తానే కుమిలిపోయాడు. బ్యాంకులు రుణం ఇచ్చుంటే తనకు ఈ గతి పట్టేది కాదని బాధపడ్డాడు.ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత అతడ్ని గమనించి రైతులు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. చనిపోతూ అతడు ఓ సూసైడ్ లెటర్ కూడా రాశాడు. అందులో తన చావుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే కారణమని ప్రస్తావించాడు. శంకర్ ఆత్మహత్యను నిరసిస్తూ ఆ ఊర్లో రైతులందరూ కలిసి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.